ఇంగ్లండ్కు భారీ షాక్.. వన్డే వరల్డ్కప్కు కెప్టెన్ దూరం
X
ఇంగ్లండ్ క్రికెట్ టీంకు భారీ షాక్ తగిలింది. వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నట్లు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. దీంతో స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్ టీం బరిలోకి దిగనుంది. 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్ కు మొదటి వరల్డ్ కప్ అందించాడు బెన్ స్టోక్స్. ఇటీవల వన్డేలకు స్టోక్స్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతకొంత కాలంగా రిటైర్మెంట్ ను వెక్కి తీసుకుని.. తిరిగి జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. యాషెస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్టోక్స్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తాను రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవట్లేదని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా యాషెస్ సిరీస్ అనంతరం హాలిడే ట్రిప్ కు వెళ్తున్నట్లు వివరించాడు. దీంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ బరిలోకి దిగడం సాహసమనే చెప్పాలి. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఆల్ రౌండర్ గా, హిట్టర్ గా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు స్టోక్స్.