ENG vs NZ: రిటైర్మెంట్ నుంచి వచ్చి.. కివీస్ బౌలర్లపై ఊచకోత
X
2019 వన్డే వరల్డ్ కప్ ఇంగ్లండ్ ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. ఓడిపోతున్న ఇంగ్లండ్ ను సింగిల్ హ్యాండ్ తో గెలిపించాడు బెన్ స్టోక్స్. క్రికెట్ లవర్స్ కు ఫైనల్ మ్యాచ్ ఇంకా కళ్లకు కట్టినట్లు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బెన్ స్టోక్స్ అనూహ్యంగా వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం టీ20, టెస్ట్ మ్యాచ్ లకే పరిమితం అయ్యాడు. కాగా ఇటీవలే తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. భారత్ లో జరిగే వరల్డ్ కప్ 2023 కోసం ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు సన్నదం అవుతుంది. అంతేకాదు ఆ జట్టులో స్టోక్స్ కు కూడా అవకాశం కల్పించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఆడుతుంది.
వరల్డ్ కప్ ముంగిట స్టోక్స్ సంచలన ప్రదర్శన చేశాడు. రిటైర్మెంట్ నుంచి వచ్చిన తర్వాత ఆడిన మొదటి మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. నాలుగు వన్డేల సిరీస్ లో భాగంగా మూడో వన్డేలో ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్ 182, 124 బంతుల్లో సాధించాడు. అందులో 15 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో వన్డే ఫార్మట్ లో ఇంగ్లండ్ తరుపున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. అంతకు ముందు ఈ రికార్డ్ జేసన్ రాయ్ (180) పేరిట ఉంది. స్టోక్స్ ఊచకోత డబుల్ సెంచరీ దిశగా సాగుతుంది అనుకున్న టైంలో బెన్ లిస్టర్ ఔట్ చేశాడు. స్టోక్స్ విధ్వంసానికి డేవిడ్ మలన్ (96,95 బంతుల్లో) తోడవడంతో 48.1 ఓవర్లలో 368 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ట్రెంట్ బౌల్ట్ (5/51) ఆకట్టుకోగా.. బెన్ లిస్టర్ 3, ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.