Home > క్రీడలు > Mohammed Shami: ‘ఇది సెమీ ఫైనల్ కాదు.. షమీ ఫైనల్’.. షమీపై అభినందనల వెల్లువ

Mohammed Shami: ‘ఇది సెమీ ఫైనల్ కాదు.. షమీ ఫైనల్’.. షమీపై అభినందనల వెల్లువ

Mohammed Shami: ‘ఇది సెమీ ఫైనల్ కాదు.. షమీ ఫైనల్’.. షమీపై అభినందనల వెల్లువ
X

అదే ఉత్కంఠ.. అదే భయం.. భారీ స్కోర్ చేసినా దేశం అంతా టెన్షన్ టెన్షన్.. క్రీజులో పాతుకుపోతున్న బ్యాటర్లు. గెలిచే మ్యాచ్ చేయి జారతున్న పరిస్థితి. పనిచేయని వ్యూహాలు. ఏ బౌలర్ కు అంతుపట్టని పిచ్. అందరి ముఖాల్లో ఆవేదన. ఏం చేయలేమా అనే నిరుత్సాహం. మళ్లీ వెనుదిరగాలా.. పాతరోజులు గుర్తుచేసుకోవాలాఅనే అందరిలో లోలోపల కలవరం. ఊపిరిబిగబట్టి మ్యాచ్ చూస్తున్నారు. అప్పుడొచ్చాడు మహ్మద్ షమీ. బాల్ అందుకుని ఒకే ఓవర్లో వరుసగా మెయిన్ వికెట్లు పడగొట్టాడు. గాడితప్పిన మ్యాచ్ ను తిరిగి టీమిండియా చేతుల్లోకి తీసుకొచ్చాడు. 150 కోట్ల మంది అభిమానుల్లో ఊపిరందించాడు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో షమీ రెచ్చిపోయాడు. 7 వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించాడు. ఇది సెమీఫైనల్ కాదు.. షమీ ఫైనల్ అనేలా మ్యాచ్ ను మలుపుతిప్పాడు. గెలుపులో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 2019లో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

కాగా మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టిన షమీ అరుదైన ఘనత సాధించాడు. ఓడీఐ వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా 50 వికెట్ల పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. కేవలం 17 ఇన్నింగ్స్ లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో స్టార్క్ (19), మలింగ (25), బౌల్ట్ (28) ఉన్నారు. కేవలం 795 బంతుల్లోనే షమీ ఈ ఘనత అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో తొలిసారిగా 1983లో వెస్టిండీస్ బౌలర్ విన్స్ టన్ డేవిస్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 20ఏళ్లకు గానీ ఈ రికార్డ్ మళ్లీ తిరగరాయలేదు. 2003వరల్డ్ కప్ లో ఆసీస్ బౌలర్లు గ్లెన్ మెక్గ్రాత్.. నమీబియాపై, ఆండీ బిచెల్.. ఇంగ్లండ్ పై ఈ ఫీట్ అందుకున్నా. 2015లో టిమ్ సౌథీ.. ఇంగ్లండ్ పై, తాజాగా భారత్ బౌలర్ షమీ న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుంగా టీమిండియా బౌలర్ షమీ చరిత్ర సృష్టించాడు. ఒకే వరల్డ్ కప్ లో 3 సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టిన తొలి ప్లేయర్ నిలిచారు. ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన షమీ 23 వికెట్లు తీసుకున్నాడు. కివీస్ పైనే రెండు సార్లు ఐదు వికెట్లు తీయడం గమనార్హం. నాకౌట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ షమీనే.

Updated : 16 Nov 2023 1:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top