ఇద్దరు సెంచరీలతో నేపాల్‌పై భారత్ భారీ స్కోరు
X
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల సత్తా చాటుతున్నారు. నేడు నేపాల్‌తో బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది. సచిన్ దాస్ 101 బంతుల్లో116 పరుగులు చేశారు. కెప్టెన్ ఉదయ్ సహరన్ 107 బంతుల్లో 100 రన్స్‌తో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఆరంభంలో తడబడింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (21),అర్షిన్ కులకర్ణి (18)లు తడబడ్డారు. ముషీర్ ఖాన్ (7 నాటౌట్) ను కాదని వన్ డౌన్‌లో ప్రియాన్షు మోలియా (19)ను పంపితే అతడు రనౌట్ అయ్యాడు. దీంతో భారత్.. 13.6 ఓవర్లలో మూడు కీలక వికెట్లను కోల్పోయి 62 పరుగులు చేసింది.
భారీ భాగస్వామ్యం..
భారత స్కోరు 62-3గా ఉన్న క్రమంలో క్రీజులోకి వచ్చిన సహరన్.. సచిన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడినా తర్వాత ఝూలు విదిల్చారు. అర్థ సెంచరీల తర్వాత జోరు పెంచిన ఈ జోడీ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించడంతో పాటు భారత్‌కు భారీ స్కోరును అందజేశారు. 93 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న సచిన్.. ఆఖర్లో ధాటిగా ఆడాడు. 80లలో ఉండగా రెండు ఫోర్లు కొట్టి 90లలోకి చేరిన సహరన్.. 49వ ఓవర్లో రెండో బంతికి శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించారు.