టీమిండియాకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు కీలక పేసర్ దూరం
X
టీమిండియా(Team India)కు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్ జడేజా మూడో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని క్రీడా వర్గాలు తెలిపాయి. మరోవైపు తొలి రెండు టెస్టులకు మ్యాచ్‌కి దూరమైన మహ్మద్ షమీ (Mohammed Shami) కూడా మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదని ఆయన పేర్కొన్నాయి. ఈ ఇద్దరిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ ఇద్దరి స్థానాల్లో అజిత్ అగార్కర్ సారథ్యంలోని మెన్స్ సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది.
ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ భారత్-ఏ తరఫున ఇంగ్లండ్-ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. భారత జట్టుకు ఎంపికైన ఆవేశ్ ఖాన్(Avesh Khan).. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతని సేవలు అవసరమైతే.. భారత జట్టుతో చేరుతాడు.సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. గత రెండు-మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడు. సెంచరీల మోత మోగించినా అతన్ని భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు. కేఎల్ రాహుల్ గాయపడటంతో అతనికి భారత జట్టు పిలుపు దక్కింది. జట్టులోకి వచ్చినా.. తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించే అవకాశం లేదు. అతనికి రజత్ పటీదార్‌తో పోటీ నెలకొనుంది. వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీతో కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. వైజాగ్ (Vizag) వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 2) రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.