Home > క్రీడలు > ఇషాన్ కిషన్ తప్పిదం.. ఆసీస్కు కలిసొచ్చింది

ఇషాన్ కిషన్ తప్పిదం.. ఆసీస్కు కలిసొచ్చింది

ఇషాన్ కిషన్ తప్పిదం.. ఆసీస్కు కలిసొచ్చింది
X

ఒక చిన్న తప్పిదం భారీ మూల్యానికి కారణం అవుతుంది అనడానికి నిదర్శనం నిన్న భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్. కీపర్ ఇషాన్ కిషన్ చేసిన చిన్న తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. ఆసీస్ గెలుపుకు 9 బంతుల్లో 33 పరుగులు అవసరం అయ్యాయి. ఆ టైంలో అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి మాథ్యూ వేడ్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ ఆడతాడు. బంతిని దొరకబుచ్చుకున్న ఇషాన్ స్టంపింగ్ చేసి అప్పీల్ చేస్తాడు. థర్డ్ అంపైర్ డిసిషన్ లో అది నాటౌట్ గా తేలింది. అయితే బాల్ ను అందుకునే క్రమంలో ఇషాన్‌ గ్లోవ్స్‌ స్టంప్స్‌ కన్నా ముందుకు రావడంతో అంపైర్‌ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో ఫ్రీహిట్ ను సద్వినియోగం చేసుకున్న వేడ్.. సిక్స్ కొట్టాడు. అదే ఓవర్ లో చివరి బంతికి బైస్ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 21 రన్స్ చేయాల్సింది ఉండగా.. మ్యాక్స్ వెల్ 4,1,6,4,4,4 బాది తన సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా మ్యాచ్ ను గెలిపించాడు. కాగా ఐసీసీ రూల్స్ ప్రకారం బౌలర్ బంతి వేసిన తర్వాత వికెట్ కీపర్ స్టంప్స్ వెనకాలే బంతిని అందుకోవాలి. గ్లవ్స్ లో కొంత భాగం ముందుకు వచ్చినా దాన్ని అంపైర్ నో బాల్ గా ప్రకటిస్తాడు. ఇషాన్ అప్పీల్ చేయకపోతే.. ఫ్రీహిట్ అవకాశం వచ్చేది కాదు. సిక్స్ కొట్టేవాడు కాదు. ఆ బంతిలో మ్యాచ్ మలుపు తిరిగేది కాదు.

Updated : 29 Nov 2023 3:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top