BBL 2024 Finals: కల్లుచెదిరే క్యాచ్తో మలుపు తిప్పాడు.. BBL ఛాంపియన్గా బ్రిస్బేన్
X
బిగ్ బాష్ లీగ్ 2023-24 (బీబీఎల్) ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్ జట్టు నిలిచింది. దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన బీబీఎల్ 13వ సీజన్.. నేటితో ముగిసింది. బుధవారం సిడ్నీ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో 54 పరుగులతో గెలుపొందిన బ్రిస్బేన్ హీట్.. బీబీఎల్ 13వ సీజన్ విజేతగా, రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. బ్రిస్బేన్ బౌలర్ల దాటికి కేవలం 112 పరుగులే చేసి కుప్పకూలింది.
మొదట బ్యాటింగ్ చేసినన బ్రిస్బేన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జోష్ బ్రౌన్ (53) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మాథ్యూ రెన్షా (40), కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (33), మాక్స్ బ్రయంట్ (29)లు రాణించారు. సిడ్నీ బౌలర్లలో సీన్ అబాట్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ.. 17.3 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే చేసింది. సిడ్నీ బ్యాటర్లలో మోయిసెస్ హెన్రిక్స్ (25), జోష్ ఫిలిప్స్ (23) టాప్ స్కోరర్లు. బ్రిస్బేన్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్వెప్సన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మైకేల్ నీసర్ పట్టిన క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. కాగా ఆ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
That champion sound 🎶@HeatBBL #BBL13 pic.twitter.com/7Hzxxs0f72
— KFC Big Bash League (@BBL) January 24, 2024
HE’S DONE IT AGAIN! 🤯
— KFC Big Bash League (@BBL) January 24, 2024
Michael Neser - you absolute superstar. #BBL13 pic.twitter.com/yHxvNLCrwv