Home > క్రీడలు > బుమ్రా దెబ్బకు చేతులెత్తేసి ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ఆధిక్యంలో భారత్

బుమ్రా దెబ్బకు చేతులెత్తేసి ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ఆధిక్యంలో భారత్

బుమ్రా దెబ్బకు చేతులెత్తేసి ఇంగ్లాండ్ బ్యాటర్లు.. ఆధిక్యంలో భారత్
X

వైజాగ్ లో జరుగుతున్న రెండో టెస్టులో తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టును బెంబేలెత్తించాడు జస్ప్రిత్ బుమ్రా. బౌలింగ్ వేరియేషన్స్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లుకు చుక్కలు చూపించాడు. స్పిన్ కు అనుకూలిస్తుందనుకున్న పిచ్ పై విరుచుకుపడ్డాడు. 6 వికెట్లతో సత్తా చాటాడు. ఫలితంగా ఇంగ్లాండ్ రెండో రోజు చివరి సెషన్ లో 253 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ను దాటిగా ఆరంభించిన జాక్ క్రావ్లే (76), డుక్కెట్ (21).. లంచ్ బ్రేక్ తర్వాత దొరికిపోయారు. తర్వాత ఏ బ్యాటర్ కూడా పెద్దగా క్రీజులో కుదురుకోలేకపోయారు. రూట్ (5), బెయిర్ స్ట్రో (25), స్టోక్స్ (47)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

మొదటి టెస్ట్ మ్యాచ్ హీరో ఓలీ పోప్ ను (23).. బుమ్రా స్పెషల్ యార్కర్ తో వికెట్ తీశాడు. బుమ్రా యార్కర్ ను అడ్డుకునేందుకు పోప్ విశ్వ ప్రయత్నం చేసినా.. పోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుల్లెట్ వేగంతో వచ్చిన యార్కర్ కు చేతులెత్తేశాడు. యార్కర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. కాగా పోప్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 1 వికట్ తీసుకున్నారు. కాగా ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Updated : 3 Feb 2024 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top