Home > క్రీడలు > Bumrah : బుమ్రా ముందు కుప్పిగంతులు.. రూట్ దిమ్మ తిరిగింది

Bumrah : బుమ్రా ముందు కుప్పిగంతులు.. రూట్ దిమ్మ తిరిగింది

Bumrah : బుమ్రా ముందు కుప్పిగంతులు.. రూట్ దిమ్మ తిరిగింది
X

రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టును బెంబేలెత్తిస్తున్నాడు. బౌలింగ్ వేరియేషన్స్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లుకు చుక్కలు చూపిస్తున్నాడు. స్పిన్ కు అనుకూలిస్తుందనుకున్న పిచ్ పై విరుచుకుపడుతున్నాడు. తన పదునైన బంతులతో ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అలాంటిది ఎవరైనా ఈ యార్కర్ల వీరుడి బౌలింగ్ లో ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ మాత్రం పిచ్ లో కుప్పిగంతులేశాడు. అనవసరపు షాట్ ఆడి తన వికెట్ పారేసుకున్నాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ బుమ్రా నాలుగో బంతికి.. రూట్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. దీంతో మూల్యం చెల్లించుకున్నాడు.





సాధారణంగా పేస్ బౌలర్లపై రివర్స్ స్వీప్ ఆడటంతో రూట్ సిద్ధహస్తుడు. కానీ ఆ బంతికి టైమింగ్ సెట్ కాకపోవడంతో సెకండ్ స్లిప్ లో ఉన్న యశస్వీ జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో రోజు ఆరంభంలోనే ఇంగ్లాండ్ కీలక వికెట్ కోల్పోయింది. రూట్ 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా ఫాబ్ ఫోర్ లో ఒకరైన రూట్ ను.. బుమ్రా టెస్టుల్లో 9 సార్లు ఔట్ చేయడం విశేషం. అనంతరం వచ్చిన బెయిస్ట్రో (0) కూడా కుల్దీప్ యాదవ్ కు దొరికిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 304 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. సిరీజ్, కుల్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్, జడేజా తలా ఓ వికెట్ తీసుకున్నారు.










Updated : 17 Feb 2024 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top