IND vs NEP: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్కు బుమ్రా దూరం
X
ఆసియా కప్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ ను డ్రా అయిన కారణంగా టీమిండియాకు ఒక పాయింట్ వచ్చింది. ఇక నేపాల్ తో జరిగే రెండవ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుని జట్టులో ఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా.. జట్టుకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ముంబై తిరిగి వెళ్లినట్లు ఓ నేషనల్ మీడియా కథనంలో వెల్లడించింది. దీంతో బుమ్రా నేపాల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు. అయితే బుమ్రా తిరిగి జట్టులో జాయిన్ అవుతాడా? ఆసియా కప్ లో కొనసాగుతాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కొందరు మాత్రం బుమ్రా సూపర్-4 మ్యాచ్లకు అందుబాటులో ఉంటారని సమాచారం. వరల్డ్ కప్ దగ్గర పడుతున్న వేళ.. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లకు ప్లేయర్లు అందుబాటులో ఉండాలని చూస్తుంటే.. వ్యక్తిగత కారణాలతో ప్లేయర్లు జట్టుకు దూరం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న బుమ్రాకు ప్రతీ మ్యాచ్ కీలకమే. అతని ఫామ్ అందుకోవడానికి ప్రతి మ్యాచ్ సాయపడుతుంది. ఈ క్రమంలో చిన్న మ్యాచ్ కు దూరం అవ్వడం ఆలోచించాల్సిన విషయమే. జట్టులో బుమ్రా స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని తెలిసిందే. అలాంటిది వ్యక్తిగత కారణాలతో జట్టును వదలడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.