చరిత్రలో ఒకే ఒక్కడు.. అగ్రస్థానంలో బుమ్రా
X
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో.. మొదటి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు జస్ప్రిత్ బుమ్రా. బౌలింగ్ యూనిట్ కు వెన్నెముఖలా నిలబడ్డాడు. ఇక రెండు టెస్టులో అతని బౌలింగ్ అద్భుతం అని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కొనియాడారు. స్పిన్నర్లు తేలిపోతున్నా.. ఫ్లాట్ పిచ్ పై రివర్స్ స్వింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. తన కెరీర్ లో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ కెరీస్ లో అగ్రస్థానాకి దూసుకెళ్లాడు. రెండు మ్యాచుల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కాగా టెస్టు ర్యాంకుల్లో ఓ భారత పేసర్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
బుమ్రా కూడా తొలిసారి మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. జనవరి 5, 2018 టెస్ట్ డెబ్యూ చేసిన బుమ్రా.. అద్భుతంగా రాణిస్తున్నా ఇప్పటివరకు తొలి ర్యాంకుకు చేరుకోలేదు. కాగా ప్రస్తుతం తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్న బుమ్రా.. 881 పాయింట్స్ తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కగిసో రబాడ (851) రెండో స్థానంలో నిలవగా.. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న అశ్విన్ (841) రెండు ర్యాంకులు కిందికి దిగజారాడు. రవీంద్ర జడేజా (746) రెండు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (828), జోష్ హేజిల్ వుడ్ (818) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ (864) పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలవగా.. భారత్ నుంచి విరాట్ కోహ్లీ (760) ఒక్కడే టాప్ 10లో (7వ స్థానం) ఉన్నాడు.