IND vs PAK: పాకిస్తాన్ కాసుకో.. పెరిగిన టీమిండియా బౌలింగ్ బలం
X
ఆసియా కప్ లో మరో భారీ మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. భారత్, పాక్ మధ్య కొలంబో వేదికగా ఈ బిగ్ ఫైట్ జరుగనుంది. మొదటి మ్యాచ్ కు కళ్లు కాయలు కాసేలా ఎదుచూసిన ఫ్యాన్స్ కు వర్షం నిరాశ పరిచింది. ఈ క్రమంలో సూపర్ 4 రూపంలో ఆ ఆశ నెరవేరనుంది. అయితే కీలక మ్యాచ్ లో తప్పక గెలవాలని భావిస్తున్న టీమిండియా.. తుది జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టింది. నేపాల్ తో మ్యాచ్ కు దూరమైన బుమ్రా.. తిరిగి జట్టుతో చేరాడు. దాంతో బౌలింగ్ యూనిట్ బలంగా తయారయింది. కేఎల్ రాహుల్ కూడా నెట్స్ లో రాణిస్తున్నాడు.
బుమ్రా రాకతో పేస్ బౌలర్స్ షమీ, సిరాజ్, శార్దూల్లలో ఒకరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా కొద్ది మ్యాచుల్లో చూసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ లో శార్దూల్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. దీంతో అతనిపై వేటు తప్పకపోవచ్చు. దీంతో షమీ, బుమ్రా, సిరాజ్ లతో పేస్ బౌలింగ్ యూనిట్ గట్టిగా ఉంది. వీరికి హార్దిక్ పాండ్యా తోడవడంతో దుర్భేద్యంగా కనిపిస్తుంది. అయితే ఉపఖండం పిచ్ లకు నలుగురు పేసర్లు అవసరం లేని కారణంగా.. అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకుని ముగ్గురు స్పిన్నర్లను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే షమిని కూడా తప్పించే ఆస్కారముంది.