Home > క్రీడలు > Bumrah : రాంచీ టెస్ట్కు బుమ్రా దూరం...కారణమేంటో తెలుసా!

Bumrah : రాంచీ టెస్ట్కు బుమ్రా దూరం...కారణమేంటో తెలుసా!

Bumrah : రాంచీ టెస్ట్కు బుమ్రా దూరం...కారణమేంటో తెలుసా!
X

టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే నాలుగవ టెస్ట్ లో అందుబాటులో ఉండనట్లు తెలుస్తోంది. రాజ్ కోట్ టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో మ్యాచుల్లో ఇండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంతకు ముందు గాయం కారణంగా 11 నెలలపాటు జట్టుకు దూరమైన బుమ్రా ఇటీవలే టెస్టులో జాయిన్ అయ్యాడు. అసలైతే రాజ్‌కోట్ టెస్ట్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిన బుమ్రా...రాంచీ టెస్టు నుంచి బ్రేక్ తీసుకోనున్నాడు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరగనున్న చివరి టెస్ట్ కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అంటే దాదాపు 20 రోజులపాటు తను విశ్రాంతి తీసుకోనున్నాడు. రాంచీ టెస్టులో ఒకవేళ ఇంగ్లండ్ విజయం సాధిస్తే అప్పుడు ధర్మశాల టెస్టు కీలకంగా మారుతుంది. దీంతో అప్పుడు బుమ్రాను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా సీరిస్ ను కైవసం చేసుకుంటే చివరి రెండు టెస్ట్ లు బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడని సమాచారం. ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 80కిపైగా బుమ్రా ఓవర్లు వేశాడు. అయితే అతని స్థానంలో ముకేశ్ కుమార్ కానీ, పిచ్‌ అనుకూలతను బట్టి నాలుగో స్పిన్నర్‌ను కానీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మూడో టెస్టుకు ముందు రంజీ ట్రోఫీ కోసం ముకేశ్ కుమార్‌ను జట్టు నుంచి తప్పించారు. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ముకేశ్ కుమార్ బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లను పడగొట్టాడు.

Updated : 19 Feb 2024 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top