‘ఆర్సీబీకి మంచి రోజులొచ్చాయి’.. అనుకునేంతలోనే..! గ్రీన్కు ఇలా జరిగిందేంటి?
X
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సంచలన విషయం బయటపెట్టాడు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఈ కారణంగానే పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపిక కాలేదని తెలుస్తుంది. కాగా ఈ వార్త ఆర్సీబీ అభిమానులకు షాక్ ఇచ్చింది. గత ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన గ్రీన్.. కీలక మ్యాచుల్లో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్ లో ముంబై జట్టును వీడి ఆర్సీబీలో చేరాడు. దీంతో ఆర్సీబీ జట్టు బలం మరింత బలపడింది. గ్రీన్ చేరికతో అంతా సంబరాలు చేసుకున్నారు. ఇక ఆర్సీబీ జట్టుకు తిరుగులేదని భావించారు. ఇంతలోనే గ్రీన్ ఈ పిడుగు లాంటి వార్తను బయటపెట్టాడు. అయితే గ్రీన్ వ్యాధి నుంచి కోలుకుంటాడా? ఐపీఎల్ సమయానికి తిరిగొస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చికిత్స పొందుతున్నాడు.
గ్రీన్ కు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధి ఉంది. ఈ వ్యాధి మొత్తం ఐదు దశలు ఉంటుంది. చివరి దశలో కిడ్నీ మార్పిడి, డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం గ్రీన్ రెండో స్టేజ్ లో ఉన్నట్లు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. గ్రీన్ తాజాగా హాస్పిటల్ లో టెస్టులు చేయించుకోగా.. తాను సెకండ్ స్టేజ్ లో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ప్రస్తుతం గ్రీన్ తన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి జట్టులో చేరతాడని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు గ్రీన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.