రిస్క్ తీసుకోలేను...మయాంక్ అగర్వాల్ ఫన్నీ పోస్
X
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ పోస్టు పెట్టాడు. ఇటీవల ఇండిగో విమాన ప్రయాణంలో ఎదుర్కొన్న సమస్యపై ఆసక్తికరంగా స్పందించాడు. ‘అసలు రిస్క్ తీసుకోలేను’ అంటూ కాప్షన్ పెట్టి వాటర్ బాటిల్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అయితే గతంలో వాటర్ అనుకొని హానికర ద్రవం తాగడంతో మయాంక్ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరింస్తున్నాడు మయాంక్ అగర్వాల్. కాగా గతనెల చివర్లో త్రిపురతో జరిగిన మ్యాచ్ అనంతరం ఢిల్లీ విమానం ఎక్కాడు. మధ్యలో దాహాం వేయడంతో సీటు ముందు పౌచ్‌లోని ద్రవాన్ని కొంచం తాగాడు. దీంతో వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని అగర్తలకు మళ్లించి...స్థానిక ఆసుపత్రిలోకి చేర్పించారు. మయాంక్ గొంతులో వాపు, బొబ్బలు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ఇటీవల తెలిపాడు. 32 ఏళ్ల మయాంక్ ఇండియా తరఫున 21 టెస్టులు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడాడు.