Home > క్రీడలు > బీజేపీ కాషాయం కుట్ర.. అందుకే టీమిండియాకు ఆ రంగు

బీజేపీ కాషాయం కుట్ర.. అందుకే టీమిండియాకు ఆ రంగు

బీజేపీ కాషాయం కుట్ర.. అందుకే టీమిండియాకు ఆ రంగు
X

ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ సహా ప్రముఖులు ఈ మ్యాచ్ కు హాజరుకానున్నారు. టీమిండియానే కప్పు కొట్టాలని దేశం మొత్తం ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ తో సహా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలను కాషాయ రంగులోకి మార్చడానికి ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. సెంట్రల్ కోల్‌కతాలోని పోస్టా బజార్‌లో జగద్ధాత్రి పూజ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ.. క్రికెట్ జట్టు ప్రాక్టీస్ జెర్సీలలో మాత్రమే కాకుండా మెట్రో స్టేషన్ల పెయింటింగ్‌లో కూడా బీజేపీ కాషాయ రంగును ప్రవేశపెట్టిందన్నారు.

ఈ సందర్భంగా తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ ‘బీజేపీ దేశమంతా కాషాయ రంగుతో నింపేయాలని చూస్తుంది. ఆ ప్రయత్నంలోనే క్రికెట్ ప్రాక్టీస్ జెర్సీని కాషాయం రంగులోకి తీసుకొచ్చింది. మన భారత ఆటగాళ్లను చూసి మేము గర్విస్తున్నాం. ప్రపంచ కప్‌ గెలుస్తారని నమ్ముతున్నాం. కానీ బీజేపీ అక్కడ కూడా కాషాయ రంగును తీసుకొచ్చింది. టమిండియా ఆటగాల్లంతా కుంకుమపువ్వు రంగులో ఉన్న జెర్సీల్లో ప్రాక్టీస్ చేస్తున్నార’ని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. టీమిండియా ఫైనల్ చేరిందని సంబరాలు చేసుకోకుండా.. రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. అసలు క్రీడలకు, రాజకీయాలను అంటగట్టడం తప్పని మమతపై ఫైర్ అవుతున్నారు.

Updated : 18 Nov 2023 1:19 PM IST
Tags:    
Next Story
Share it
Top