Home > క్రీడలు > IND vs PAK : లక్ష గళాలు ఒక్కటై.. జనగణమన పాడుతుంటే..! : పాక్ కోచ్

IND vs PAK : లక్ష గళాలు ఒక్కటై.. జనగణమన పాడుతుంటే..! : పాక్ కోచ్

IND vs PAK : లక్ష గళాలు ఒక్కటై.. జనగణమన పాడుతుంటే..! : పాక్ కోచ్
X

ఉత్కంఠ రేపుతుంది అనుకున్న మ్యాచ్.. వార్ వన్ సైడ్ లా సాగింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటడంతో.. పాకిస్తాన్ పై ఆధిపత్యం ప్రద్శించారు. దీంతో పాక్ అహ్మదాబాద్ లో భారత్ కు తల వంచక తప్పలేదు. లక్షా పదివేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షిస్తుంటే.. దాదాపు 99 శాతం మంది బ్లూ జెర్సీ ధరించి టీమిండియా నినాదాలు చేస్తుంటే.. స్టేడియంలోని లక్షమంది ఒకేసారి వందేమాతరం, జనగణమన పాడుతుంటే.. భారత గెలుపు అక్కడే ఖరారయింది. పాక్ పై ఘన విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మ్యాచ్ లో ఓటమి అనంతరం పాకిస్తాన్ కోచ్ మికీ ఆర్థర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం బీసీసీఐ అని ఆరోపించాడు.




‘దయాదుల పోరు చూస్తుంన్నంత సేపు ఐసీసీ ఈవెంట్ జరిగినట్లు లేదు. బీసీసీఐ ఈవెంట్ లా అక్కడి వాతావరణం కనిపించింది. ఏదో వాళ్ల గడ్డకు వచ్చి ద్వైపాక్షిక సిరీస్ ఆడినట్లు అనిపించింది. మ్యాచ్ మొత్తంలో పాక్ జట్టుకు ఒక్కసారి కూడా ఎవరి నుంచి మద్దతు లభించలేదు. కనీసం ఒక్కసారి కూడా దిల్ దిల్ పాకిస్తాన్ మ్యూజిక్ పెట్టలేదు. ఇది కూడా మా జట్టు ఓటమికి ఒక కారణం. చుట్టూ ఉన్న వాతావరణం బట్టి కూడా ప్లేయర్ల ఆటలో మార్పు వస్తుంది. ఇక్కడ మాకు మద్దతే దొరకలేదు. ఇందులో మా తప్పు కూడా ఉంది. మా వ్యూహాలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా ప్లేయర్లు ఇంకాస్త దూకుడుగా ఆడితే బాగుండేది’ అని కోచ్ ఆర్థర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో హాట్ స్టార్ లైవ్ లో 3.5 కోట్ల మంది వీక్షించి సరికొత్త రికార్డ్ సృష్టించారు.




Updated : 15 Oct 2023 6:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top