ENG vs NZ: భారత ప్రేక్షకులకు బజ్ బాల్ రుచి.. కివీస్ ఈజీగా..
X
అభిమానులు రాలేదు.. ఓపెనింగ్ సెర్మనీ లేదు. అసలు వరల్డ్ కప్ ఫీలింగే రావట్లేదు అని ఫీల్ అయిన క్రికెట్ అభిమానులకు మంచి కిక్ వచ్చింది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ప్రేక్షకులు బజ్ బాల్ రుచి చూశారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ 77, బట్లర్ 43 పరుగులతో రాణించారు. 283 పరుగులతో బరిలోకి దిగిన కివీస్.. భారీ స్కోర్ ను ఊదేశింది. కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 283 లక్ష్యాన్ని చేదించింది. డేవోన్ కాన్వే 152, 121 బంతుల్లో, రచిన్ రవిచంద్ర 123, 96 బంతుల్లో అసలైన బజ్ బాల్ గేమ్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 37 ఓవర్లలో టార్గెట్ ను చేదించి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ నుంచి సామ్ కరణ్ ఒక వికెట్ పడగొట్టాడు.
వరల్డ్కప్లో తొలి సెంచరీ:
వరల్డ్ కప్ తొలి సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీతో చెలరేగారు. 83 బంతుల్లో 2 సిక్సర్లు, 13 ఫోర్లతో శతకం బాదాడు. కివీస్ మరో బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా సెంచరీ చేశాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 3 వికెట్లు తీసుకోగా.. గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్ ఒక వికెట్ పడగొట్టాడు.