Australia test cricket: స్మిత్ రీ ఎంట్రీ.. వార్నర్కు రీప్లేస్గా భారీ హిట్లర్
X
సుదీర్ఘ కెరీర్ తర్వాత డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 112 మ్యాచ్ లు ఆడిన వార్నర్.. 8786 పరుగులు చేశాడు. అందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లోనూ హిట్టింగ్ చేస్తూ.. ప్రత్యర్థులను హడలెత్తించే వార్నర్ రిటైర్ అవడం.. ఆసీస్ కు తీరని లోటే. ఈ క్రమంలో అతని స్థానాన్ని భర్తీ చేయడంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో వార్నర్ రీప్లేస్ గా జట్టులోకి కామెరాన్ గ్రీన్ ను జట్టులోకి తీసుకుంది. ఆల్ రౌండర్ గా, హిట్టర్ గా మంచి గుర్తింపు ఉన్న గ్రీన్ వార్నర్ ప్లేస్ ను రీప్లేస్ చేస్తాడని భావిస్తున్నారు.
ఇక స్టీవ్ స్మిత్ ను కూడా వార్నర్ రీప్లేస్ గా దింపనున్నారు. వార్నర్ ఓపెనర్ గా బరిలోకి దిగేవాడు. అయితే అతని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. దాంతో స్మిత్ ను ఓపెనర్ గా పంపే ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. స్మిత్ ను ఓపెనర్ గా, గ్రీన్ ను నెంబర్ 4లో బరిలోకి దింపనున్నారు. జనవరి 17 నుంచి వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో.. కొత్త ఆస్ట్రేలియా జట్లును చూస్తామని మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.