Cricket in Olympics: 120 ఏళ్ల నిరీక్షణకు తెర.. క్రికెట్కు గ్రీన్ సిగ్నల్
X
ఒలింపిక్స్ కు 128 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక అప్పటి నుంచి క్రికెట్ ను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రయత్నానికి, క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడ్డట్లు కనిపిస్తుంది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో జరగబోయే ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. క్రికెట్ తో పాటు బేస్ బాల్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోసీ క్రీడలను కూడా 2028 ఒలింపిక్స్ లో చేర్చాలని భావిస్తున్నట్లు లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపార. అక్టోబర్ 15న ముంబైలో జరిగే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సమావేశంలో దీనిపై ప్రకటన చేయనున్నారు. అదే జరిగితే 120 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తుంది.
1900 సంవత్సరంలో జరిగిన పారి్ ఒలింపిక్స్ లో మొదటిసారి క్రికెట్ ను ప్రవేశపెట్టారు. అందులో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో క్రికెట్ ను ఒలింపిక్స్ నుంచి తొలగించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చాలా అనుకులంగా ఉన్నాయి. దీంతో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనే డిమాండ్ మొదలయింది. ఇప్పటి వరకు చాలాసార్లు దీపిపై చర్చలు జరిగినా.. కార్యరూపం దాల్చలేదు. అయితే లాస్ ఏంజిలెస్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని నిర్వాహకులే ప్రతిపాదించారు. దీనిపట్ల ఐసీసీ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒలింపిక్స్ కమిటీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లు కూడా ఓకే చెప్తే 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉంటుంది.