Home > క్రీడలు > పాకిస్తాన్లోని విరాట్ అభిమానుల ప్రేమ.. కరెన్సీపై కోహ్లీ బొమ్మ ప్రింట్ చేయాలని డిమాండ్

పాకిస్తాన్లోని విరాట్ అభిమానుల ప్రేమ.. కరెన్సీపై కోహ్లీ బొమ్మ ప్రింట్ చేయాలని డిమాండ్

పాకిస్తాన్లోని విరాట్ అభిమానుల ప్రేమ.. కరెన్సీపై కోహ్లీ బొమ్మ ప్రింట్ చేయాలని డిమాండ్
X

క్రికెట్ను అమితంగా ప్రేమించే, ఆరాధించే దేశాల్లో.. భారత్ తర్వాత ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. పాకిస్తాన్ మనకు శత్రుదేశమైనా.. విరాట్ కోహ్లీని అభిమానించేవారు, ఆరాధించేవారు ఆ దేశంలో కోట్లల్లో ఉంటారు. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ లోని కోహ్లీ అభిమానులు స్టేడియంలో సందడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇదంతా న్యూస్, యూట్యూబ్ వరకే అనుకుంటే పొరపాటే.. హెడ్ లైన్ చూసి.. ఇది ఫేక్ వార్త అనుకున్నా మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. నిజంగానే పాకిస్తాన్ కరెన్సీపై విరాట్ కోహ్లి ఫొటోను ముద్రించారు. దాన్ని అధికారికంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..

మన కరెన్సీపై జాతిపిత మహాత్మ గాంధీ ఫొటో ఉన్నట్లే.. పాకిస్తాన్ కరెన్సీపై కూడా ఆ దేశ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఫొటో ముద్రించి ఉంటుంది. 1947లో వారికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది కొనసాగుతుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఒక కాంపిటీషన్ పెట్టింది. కొత్త కరెన్సీ నోట్ల ముద్రణకు.. ప్రజల నుంచి కొత్త డిజైన్లను ఆహ్వానించింది. వాటిలోనుంచి ఫైనల్ చేసి.. కరెన్సీని అధికారికంగా ముద్రిస్తామని ప్రకటించింది. దీంతో చాలామంది తమ దేశ కరెన్సీపై డిజైన్ చేసి ఆర్ట్ రూపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కు పంపించారు. ఈ క్రమంలో కొంతమంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కు షాకిచ్చారు.

క్రికెట్ పిచ్చి, విరాట్ కోహ్లీపై అభిమానమున్న కొంతమంది కొత్త కరెన్సీ నోట్ల కోసం విరాట్ కోహ్లీ ఫొటో డిజైన్ చేసి పంపించారు. కొన్ని ఎంట్రీల్లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఫొటోలు కూడా వచ్చాయి. అది చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఎంట్రీలను కాంపిటీషన్ లో లెక్కలోకి తీసుకోమని తేల్చిచెప్పారు. నిబంధనలకు లోబడి ఉన్న ఎంట్రీలను మాత్రమే పరిగణంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.




Updated : 2 Feb 2024 10:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top