Home > క్రీడలు > నీ ప్లేస్లో ధోని ఉంటే ఇలా చేసేవాడా...

నీ ప్లేస్లో ధోని ఉంటే ఇలా చేసేవాడా...

నీ ప్లేస్లో ధోని ఉంటే ఇలా చేసేవాడా...
X

వెస్టిండీస్ తో మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా లాస్ట్ బాల్ ను సిక్స్ కొట్టి మరీ మ్యాచ్ గెలిపించాడు. కానీ ఇప్పుడదే అతని మీద విమర్శలకు దారి తీస్తోంది. మరీ ఇంత సార్వర్ధపరుడివి ఏంటి అంటూ క్రికెట్ ఫ్యాన్స్ హార్ధిక్ మీద విమర్శలు చేస్తున్నారు.

రేస్ లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా చాలా బాగా ఆడి గెలిచింది. సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. అలాగే తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ చేశాడు. దీంతో విజయం చాలా ఈజీ అయిపోయింది భారత్ కు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి మరీ భారత్ కు విజయాన్ని అందించాడు. అంతా బాగానే ఉంది కానీ...హార్ధిక్ సిక్స్ భారత క్రికెట్ అభిమానులకు మాత్రం చాలా కోపం తెప్పిస్తోంది. భారత్ 14 బంతుల్లో కేవలం 2 పరుగులు చేయాల్సి ఉండగా హార్దిక్ సిక్స్ కొట్టాడు. అప్పుడు మరో ఎండ్ లో తిలక్ వర్మ 49 పరుగులతో ఉన్నాడు. ఒక్క పరుగు చేస్తే అతని ఖాతాలోకి హాఫ్ సెంచరీ చేరుతుంది. వరుసగా రెండు అర్ధ శతకాలు చేసినట్లు అవుతుంది.

కరెక్ట్ గా అదే టైమ్ లో తిలక్ కు అవకాశం ఇవ్వకుండా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించేశాడు. అదే ఇప్పుడు అతన్ని ట్రోలింగ్ కు గురి చేస్తోంది. అదేమీ చివరి బంతి కాదు కదా...నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు తిలక్ కు హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఇవ్వచ్చు కదా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే నీ ప్లేస్ లో ధోనీ ఉంటే కచ్చితంగా ఇలా చేసి ఉండేవాడు కాదు అంటున్నారు. చాలాసార్లు అవతలి బ్యాట్స్ మన్ సెంచరీ, హాఫ్ సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు ధోనీ వారికి స్ట్రైక్ ఇచ్చి తన స్పోర్ట్స్ మెన్ షిప్ ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అదే హార్ధిక్ పాండ్యాకు గుర్తు చేస్తూ...మరీ అంత స్వార్ధం మంచికాదని వాయించేస్తున్నారు. కెప్టెన్ గా ఉండి ఇలా అస్సలు చేయకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ముందు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇలాగే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. 2001-02 సీజన్ లో పాక్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ 194 పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ద్రావిడ్ విమర్శల పాలయ్యాడు. ఇదే మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ త్రిశతకం చేశాడు. ఈ మ్యాచ్ భారత్ గెలిచింది కూడా. కానీ ద్రవిడ్ నిర్ణయాన్ని మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ క్షమించలేకపోతున్నారు. ఇప్పుడు హార్దిక్ కూడా అదే తప్పును రిపీట్ చేశాడు.

Updated : 9 Aug 2023 10:45 AM IST
Tags:    
Next Story
Share it
Top