Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
X
వన్డే వరల్డ్‌కప్-2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఉప్పల్‌లో వరుసగా ఇది రెండో రోజు వరల్డ్‌కప్ మ్యాచ్. ఇక.. లంక జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. కసున్ రజిత స్థానంలో మహీశ్ తీక్షణ జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫఖర్ జమాన్ స్థానంలో అబ్దుల్లా షఫీక్ జట్టులోకి వచ్చాడు.
మెగా టోర్నీలో నెదర్లాండ్స్‌పై సూపర్ విక్టరీతో బాబర్ సేన బోణీ కొట్టగా.. దక్షిణాఫ్రికా చేతిలో లంక బృందం 102 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఎలాగైనా పాకిస్థాన్‌పై గెలవాలని లంక భావిస్తుంది. మరోవైపు ఆసియా కప్‌లో లంక చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కసితో ఉంది. అయితే.. ఉప్పల్‌లో ప్రాక్టీస్ గేమ్ తో సహా మూడు మ్యాచ్‌లు ఆడడం బాబర్ సేనకు కలిసొచ్చే అంశం.
శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక
పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్