Home > క్రికెట్ > భారత్ జట్టులోకి యువ వికెట్ కీపర్..? వారికి చెక్..!

భారత్ జట్టులోకి యువ వికెట్ కీపర్..? వారికి చెక్..!

భారత్ జట్టులోకి యువ వికెట్ కీపర్..? వారికి చెక్..!
X

వన్డే వరల్డ్ కప్-2023 ముందు టీమిండియాను వికెట్ కీపర్ సమస్య కాస్త వేధిస్తోంది. ధోని తర్వాత అంతటి స్థాయిలో కీపర్ దొరక్కపోవడం భారత్‌కు పెద్ద లోటుగా ఉంది. ధోనికి వారసుడిగా ఎదుగుతున్న సమయంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై జట్టుకు దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్ నాటికి పంత్ రికవరీపై ఉత్కంఠ నెలకొంది. అతడు వరల్డ్ కప్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించాడు. అయితే పంత్ కోలుకోకపోతే పరిస్థితి ఏంటీ..? రెగ్యూలర్ కీపర్ ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.





ఆ ముగ్గురు..

ప్రస్తుతం ఇషాన్ కిషన్, శ్రీకర్‌ భరత్‌, వృద్ధిమాన్ సాహా రూపంలో ముగ్గురు రెగ్యూలర్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. పంత్ రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన శ్రీకర్ భరత్ వికెట్‌ కీపింగ్‌‌కు మంచి మార్కులే పడినా..బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీతో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన భరత్‌.. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో 18.42 సగటుతో కేవలం 129 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో అతడిని తప్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.





ఇక ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో ఏదో మాదిరిగా రాణిస్తున్నా..కీపింగ్ స్పిల్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. సాహకు వయుస్సు దృష్ట్యా అతడిని ఇటీవల కాలంలో పక్కన బెట్టారు. దీంతో సెలెక్టర్లు మరో నాణ్యమైన వికెట్ కీపర్ కోసం వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ యువ ఆటగాడు పేరు గట్టిగా వినిపిస్తోంది.

యువ ఆటగాడికి చోటు ?






రానున్న వెస్టిండీస్ టూర్‌కు యువ వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్‌‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఉపేంద్ర యాదవ్‌ గురించి భారత సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. యూపీకి చెందిన ఉపేంద్ర యాదవ్‌ ప్రస్తుతం రైల్వేస్‌ తరపున దేశీవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ అతడి సొంతం. బ్యాటింగ్ లోనూ ఉపేంద్ర యాదవ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 37 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఉపేంద్ర.. 45.0 సగటుతో 1666 పరుగులు చేశాడు. వచ్చే నెలలో విండీస్‌ టూర్ కోసం ఈ ఆటగాడిని పరీక్షించాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉపేంద్ర యాదవ్‌ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్‌లకు భారత జట్టును జూన్‌ 27న బీసీసీఐ ప్రకటించనుంది. జూలై 12న డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్‌ టూర్‌ ప్రారంభం కానుంది






Updated : 21 Jun 2023 5:29 PM IST
Tags:    
Next Story
Share it
Top