ఫైనల్లో పాక్ భారీ స్కోర్...తేలిపోయిన భారత్ బౌలర్లు..
Mic Tv Desk | 23 July 2023 6:28 PM IST
X
X
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో మొదటి ఇన్సింగ్స్ ముగిసింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది. పాక్ బ్యాటర్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. సాహిమ్ ఆయుబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. కీలకమైన చివరి పోరులు భారత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పేసర్లు, స్పిన్నర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్, రాజవర్దన్ హంగార్గెకర్ చెరో రెండు వికెట్లు సాధించారు.
Updated : 23 July 2023 6:28 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire