Home > క్రికెట్ > స్టేడియంలోకి కుక్క ఎంట్రీ.. ‘హార్దిక్’ అంటూ అరుపులు!

స్టేడియంలోకి కుక్క ఎంట్రీ.. ‘హార్దిక్’ అంటూ అరుపులు!

స్టేడియంలోకి కుక్క ఎంట్రీ.. ‘హార్దిక్’ అంటూ అరుపులు!
X

అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. లాస్ట్ బాల్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో.. చివరికి గుజరాత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్ జరిగే సమయంలో అక్కడున్న వీధికుక్క స్టేడియంలోకి పరిగెత్తుకొచ్చింది. స్టేడియం మొత్తం పరుగులు పెట్టింది. దీంతో ఫీల్డ్ లో ఉన్న ఆటగాళ్లు అసలేం జరుగుతుందని ఆశ్చర్యపోగా.. ప్రేక్షకులంతా హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేశారు. కుక్క పరిగెత్తుతుంటే.. ‘హార్దిక్.. హార్దిక్’ అని నినాదాలు చేశారు. ఈ ఘటనను పాండ్య ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. గత రెండు ఐపీఎల్ టోర్నీల్లో గుజరాత్ ను ఫైనల్స్ కు చేర్చిన వ్యక్తిని అక్కడి ఫ్యాన్స్ ఇలా ద్వేషించడం సరికాదంటున్నారు.

కాగా సీజన్ స్టార్టింగ్ ముందు రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించిన ముంబై.. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకుని పగ్గాలు అప్పగించింది. అయితే అప్పటి నుంచి ముంబై, రోహిత్ శర్మ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాపై కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఫ్రాంచైజీ, పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. అయితే నిన్నటి మ్యాచులో అభిమానులు రోహిత్ శర్మకు బ్రహ్మరథం పట్టారు. ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్న టైంలో రోహిత్.. రోహిత్ అంటూ నినాదాలు చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ముంబై ఫ్రాంచైజీ నిర్ణయంపై ఎంత కోపంగా ఉన్నారో అర్థం అవుతోంది.



Updated : 25 March 2024 5:01 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top