Home > క్రికెట్ > భారత చీఫ్ సెలెక్టర్​గా టీమిండియా మాజీ పేసర్ ?

భారత చీఫ్ సెలెక్టర్​గా టీమిండియా మాజీ పేసర్ ?

భారత చీఫ్ సెలెక్టర్​గా టీమిండియా మాజీ పేసర్ ?
X

భారత్ చీఫ్ సెలెక్టర్​గా టీమిండియా మాజీ పేసర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అజిత్‌ అగార్కర్‌ పేరును బీసీసీఐ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో రెండు సార్లు సెలెక్టర్​గా అగార్కర్ పేరు వినిపించినా అది జరగలేదు. ప్రస్తుతం మాత్రం అగార్కర్ కొత్త సెలెక్టర్​గా నియమించే అవకాశం ఉంది.





గత నాలుగు నెలలుగా భారత చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీగా ఉంది. ఓ టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో భారత్ టీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి అప్పటి సెలెక్టర్ చేతన్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి సెలెక్టర్‌ను ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో చీఫ్ సెలెక్టర్ ఎంపికపై బీసీసీఐ దృష్టిసారించింది. వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ తనను సంప్రదించలేదని సెహ్వాగ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. దీంతో అపార అనుభవమున్న అగార్కర్‌ను భారత చీఫ్ సెలెక్టర్​గా నియమించనున్నారని సమాచారం. జులై 1 నుంచి ఇంటర్వ్యూలు కూడా జరగనున్నాయి. జులై మొదటివారంలో చీఫ్ సెలక్టర్ విషయంలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.





అజిత్ అగార్కర్ 26 టెస్ట్ మ్యాచ్‌ల్లో 58 వికెట్లు తీసి 571 పరుగులు చేశాడు. అగార్కర్ టెస్ట్ కెరీర్ లో ఓ సెంచరీ కూడా ఉంది. 191 వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. 1269 పరుగులు సాధించాడు. టీమిండియా తరఫున 4 టీ20 మ్యాచ్‎లను కూడా ఆడాడు. ఐపీఎల్‎లో 42 మ్యాచ్‎లను ఆడాడు. అగార్కర్ యార్కర్స్ వేయడంలో దిట్ట. అజిత్‌ అగార్కర్‌ యార్కర్‌ వేస్తే.. ఎంతటి బ్యాటర్‌ అయినా వికెట్‌ సమర్పించుకోవాల్సిందే.






Updated : 29 Jun 2023 7:17 PM IST
Tags:    
Next Story
Share it
Top