Home > క్రికెట్ > పంతం నెగ్గించుకున్న పాకిస్థాన్.. హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్

పంతం నెగ్గించుకున్న పాకిస్థాన్.. హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్

పంతం నెగ్గించుకున్న పాకిస్థాన్.. హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్
X

ఆసియా కప్-2023లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగే పోరుకు వేదికపై సస్పెన్స్ వీడింది. దయాదుల పోరు చూడలేం అనుకున్న ఫ్యాన్స్ కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ప్రతిపాధించిన హైబ్రిడ్ మోడల్ ను ఏసీసీ ఆమోదించింది. ఆసియా కప్ లో టీమిండియా ఆడనున్న మ్యాచులన్నీ శ్రీలంకలో.. మిగతా మ్యాచులు పాకిస్థాన్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై మరో 2, 3 రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

పాకిస్థాన్ లో ఆసియా కప్ నిర్వహిస్తే తమ జట్టు సెక్యూరిటీ కారణాల వల్ల ఆడబోదని.. బీసీసీఐ సెక్రెటరీ జైషా తెలిపాడు. దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. భారత్ తమ దేశం లో ఆడకపోతే.. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ భారత్ లో ఆడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఈ విషయంలో ఆసియా బోర్డ్, ఐసీసీ ఇరు దేశాల బోర్డులతో చర్చలు జరిపినా ఫలించలేదు. అప్పుడు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ ను తీసు కొచ్చింది. భారత్ ఆడే మ్యాచులు శ్రీలంకలో, మిగతా మ్యాచ్ లు పాకిస్థాన్ లో నిర్వహించేందుకు డిసైడ్ అయింది. అయితే, ఈ హైబ్రిబ్ మోడల్ పై మిగతా దేశాల బోర్డులు కూడా వ్యతిరేకించాయి. దీంతో ఫ్యాన్స్ లో దయాదుల పోరు చూడలేమనే నిరాశ మొదలైంది.

ప్రస్తుతం ఏసీసీ జరిపిన చర్చల ద్వారా.. ఈ వివాదం సద్దు మనిగిందని తెలుస్తోంది. భారత్ కూడా ఇందుకు అంగీకరించినట్లు వార్తులు వినిపిస్తున్నారు. దీనిపై మంగళవారం ఏసీసీ, బీసీసీఐ కలిసి ప్రకటిస్తాయని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్ అంగీకరిస్తే.. పాకిస్థాన్ వరల్డ్ కప్ లో భారత్ కు వచ్చి ఆడుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. టీమిండియా ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోని పల్లెకెలె లేదా గాలె స్టేడియంలో జరుగుతాయి.




Updated : 11 Jun 2023 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top