ఆసియా కప్ లో భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే
X
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17వరకు టోర్నీ జరగనుంది. అయితే టోర్నీ షెడ్యూల్ ను మామూలుగా ఏసీసీ కానీ పీసీబీ కానీ చెప్పాలి. కానీ స్టార్ స్పోర్ట్స్ దీన్ని రిలీజ్ చేసినట్టు ఓ క్రికెట్ అనలిస్ట్ తేదీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆసియా కప్ 2023 మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్ ఉంది. అన్ని మ్యాచ్ లు స్పార్ట్స్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రసారం అవుతాయి. ఈ షెడ్యూల్ ను స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఇంతకు ముందు కూడా ఆసియా కప్ ప్రారంభమవుతుందని స్టార్ స్పోర్ట్స్ తెలియజేసింది. కాబట్టి ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా నిజమే అయి ఉంటుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంచనా.
అయితే ఆసియా కప్ ఎక్కడ జరుగుతుందో ఇంకా తెలియలేదు. మామూలుగా అయితే ఈ టోర్నీ పాకిస్తాన్ లో జరగాలి. కానీ భారత్...పాక్ లో మ్యాచ్ లు ఆడేందుకు అంగీకరించకపోవడంతో తటస్థ వేదికలో నిర్వహించాలని నిర్ణయించారు. హైబ్రీడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ లో మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. వీటికి పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్ లో 4 మ్యాచ్ లు, శ్రీలంకలో జరుగుతాయి. భారత-పాక్ మధ్య మ్యాచ్ శ్రీలంకలోనే జరగొచ్చు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇందులో తలపడనున్నాయి.
Asia Cup schedule & timing by Star Sports.
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
Save your dates for epic clashes...!!!! pic.twitter.com/5Zl1wH90tB