Home > క్రికెట్ > లబూషేన్‌ తొండాట.. చీటర్‌ అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం

లబూషేన్‌ తొండాట.. చీటర్‌ అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం

లబూషేన్‌ తొండాట.. చీటర్‌ అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం
X

ఎడ్జ్ బాస్టన్ వేదికగా.. ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ లో ఆసీస్ ప్లేయర్ మార్కస్ లబూషేన్ తొండాట ఆడాడు. దీనిపై ఫ్యాన్స్ లబూషేన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆసీస్ అంటేనే తొండాటకు కేరాఫ్ అంటూ మండిపడుతున్నారు. అయితే ఏం జరిగిందంటే.. నాలుగో రోజు ఆటలో షార్ట్ లెగ్ దగ్గర లబైషేన్ ఫీలింగ్ చేశాడు. హెజిల్ వుడ్ వేసిన బౌన్సర్ ను ఓలీ రాబిన్సన్ తప్పు షాట్ ఆడాడు. దాంతో బాల్ కొద్దిసేపు గాలిలో ఉంది. దాన్ని లబూషేన్ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. తర్వాత ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.

అంపైర్ ఔట్ ఇవ్వడానే రాబిన్సన్ రివ్యూ తీసుకున్నాడు. అందులో బాల్ క్లీయర్ గా నేతను తాకుతూ కనిపించింది. ఆ విషయం లబూషేన్ కు తెలిసినా కావాలనే అప్పీల్ చేశాడు. దాంతో స్టేడియంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆసీస్ ప్లేయర్లని చీటర్ అంటూ ట్రోల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Updated : 20 Jun 2023 5:10 PM IST
Tags:    
Next Story
Share it
Top