Home > క్రికెట్ > ‘స్టోక్స్’ ఇచ్చినా.. రెండో టెస్ట్లో ఆసీస్దే విక్టరీ

‘స్టోక్స్’ ఇచ్చినా.. రెండో టెస్ట్లో ఆసీస్దే విక్టరీ

‘స్టోక్స్’ ఇచ్చినా.. రెండో టెస్ట్లో ఆసీస్దే విక్టరీ
X

యాషెస్ సిరీస్ లో భాగంగా.. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసీస్ బౌలర్లకు ఇచ్చిపడేశాడు. 214 బంతుల్లో 155 పరుగులు (9 ఫోర్లు, 9 సిక్సర్లు) అద్భుత సెంచరీ చేశాడు. అయినా.. విజయం ఆసీస్ నే వరించింది. 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడిపోయింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆసీస్ నిర్దేశించిన 371 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్..114/4 ఓవర్ నైట్ స్కోర్ తో చివరి రోజు ఆటను కొనసాగించింది. బెన్ డకట్ (83), బెన్ స్టోక్స్ (155)పరుగులు జోడించినా ఇంగ్లండ్ కు గెలుపు దక్కలేదు. 81.3 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటయింది.





వివాదాస్పదంగా బెయిర్ స్టో ఔట్ అయిన తర్వాత రెచ్చిపోయిన స్టోక్స్.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. వన్డే మ్యాచ్ ను తలపించాడు. బ్రాడ్ (11)తో ఏడో వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ఆస్ట్రేలియాను వణికించాడు. హేజిల్ వుడ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కీపర్ కు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్టీవ్ స్మిత్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.






Updated : 3 July 2023 5:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top