Home > క్రికెట్ > ఆ ఒక్క లోటు తీర్చుకున్న ఆస్ట్రేలియా

ఆ ఒక్క లోటు తీర్చుకున్న ఆస్ట్రేలియా

ఆ ఒక్క లోటు తీర్చుకున్న ఆస్ట్రేలియా
X

ఐసీసీ టోర్నమెంట్స్ అంటే చాలు ఆస్ట్రేలియాకు పూనకం వచ్చేస్తాది. వేదిక, ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగిపోతారు. ఫైనల్‌కు చేరితే చాలు ట్రోఫిని సాధించి తీరుతారు. దీనికి నిదర్శనం.. ఇప్పటివరకు ఆసీసీ సాధించిన ఐసీపీ ట్రోపిలే.

అత్యధిక ప్రపంచ కప్ ట్రోఫీలను గెలుచుకున్న ఘనత ఆస్ట్రేలియాకు ఉంది.మొత్తం ఐదుసార్లు వరల్డ్ కప్స్ గెలిచి క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. వారు 1987, 1999, 2003, 2007 మరియు 2015 ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. మరే ఇతర జట్టు రెండు కంటే ఎక్కువ గెలవలేదు. T20 ప్రపంచకప్‌ను ఆసీస్ ఒక్కసారి మాత్రమే గెలుచుకుంది, 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచారు. రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియా సాధించింది.



ఇప్పటికే అనేక ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఆసీస్.. తాజాగా తమ ఖాతాలో లేని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను దక్కించుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆ లోటును తీర్చుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కంగారూలు భారత్‌పై 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. 444 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 234 పరుగులకు ఆలౌటైంది. తద్వారా అన్ని పురుషుల ICC ట్రోఫీలను గెలుచుకున్న మొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియాకి ఇది 9వ ఐసీసీ టైటిల్ కావడం విశేషం.


Updated : 11 Jun 2023 6:48 PM IST
Tags:    
Next Story
Share it
Top