జట్టంతా కుర్రాళ్లే.. కోహ్లీ, రోహిత్ లను దూరం పెట్టారు
X
వెస్టిండీస్ తో జరగబోయే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో.. జట్టులోకి మొత్తం కుర్రాళ్లను ఎంపిక చేసింది. జట్టులో రోహిత్ శర్మ, ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించలేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోయినప్పటి నుంచి వీళ్లిద్దరినీ బీసీసీఐ పక్కనబెడుతూ.. టీ20లకు హార్దిక్ ను కెప్టెన్ గా కొనసాగిస్తూ వస్తోంది. మొదట సీనియర్లకు రెస్ట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చినా.. ఉద్దేశపూర్వకంగానే వీళ్లను పక్కన పెడుతున్నట్లు అందరికీ అనిపించింది. ఇప్పుడు అదే నిజం అని తేలిపోయింది.
2024 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని సీనియర్లను పక్కనబెట్టి.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ మాజీలు సూచిస్తున్నారు. ఈ టైంలో రోహిత్, విరాట్ ను ఇకపై వన్డేలు, టెస్టులకే పరిమితం చేసే అవకాశాలున్నాయి. అయితే, 2007లో టీ20 ఫార్మట్ మొదట్లో కూడా టీమిండియాలో ఇలానే జరిగింది. అప్పుడు టీంలో ఉన్న సీనియర్లు.. సచిన్, ద్రవిడ్ లను సైలెంట్ గా తప్పించారు. ప్రస్తుతం విరాట్, రోహిత్ ను కూడా మర్యాద పూర్వకంగా జట్టులో నుంచి తప్పుకోమని బీసీసీఐ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్ అవ్వగానే వీరి భవిష్యత్తుపై క్లారిటీ రావడం గమనార్హం.