Home > క్రికెట్ > IPL 2024: ఐపీఎల్ నిర్వాహనపై వీడిన సందిగ్ధత.. దుబాయ్లో కాదు..!

IPL 2024: ఐపీఎల్ నిర్వాహనపై వీడిన సందిగ్ధత.. దుబాయ్లో కాదు..!

IPL 2024: ఐపీఎల్ నిర్వాహనపై వీడిన సందిగ్ధత.. దుబాయ్లో కాదు..!
X

భారత్ లో వరల్డ్ కప్ కంటే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ. అప్పటివరకు కలిసున్నవాళ్లే.. తమ ఫేవరెట్ జట్టుకోసం కొట్టుకుంటారు. నా టీం గొప్ప.. నా ప్లేయర్ గొప్ప అని ట్రోల్ చేసుకుంటారు. ఐపీఎల్ ఉన్న రెండు నెలలు పండగ లాంటి వాతావరణం ఉంటుంది. ఆ కిక్ కోసం ఏడాదంతా వెయిట్ చేస్తారు. ఖర్చు ఎంతైనా సరే లెక్క చేయకుండా.. టికెట్లు కొంటుంటారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల వల్ల ఐపీఎల్ 2024 ను దుబాయ్ లో నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజం అన్నట్లు మినీ వేలం కూడా దుబాయ్ లోనే ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానులకు కిక్కిచ్చే వార్తను చెప్పేందుకు బీసీసీఐ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్ లోనే ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధం అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మ్యాచ్ ల నిర్వహణకు ఆయా రాష్ట్రాలు సముకత చూపకపోతే.. వేరే వేదికలు ఆ మ్యాచ్ ను తరలిస్తారు. అయితే ఐపీఎల్ 2024ను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మార్చి 22 నుంచి అని వార్తలు వస్తున్నా.. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలపై టీ20 వరల్డ్ కప్ జరగనుంది.




Updated : 11 Jan 2024 6:54 PM IST
Tags:    
Next Story
Share it
Top