ఫలితాలతో సంబంధం లేదు.. మా ఆట తీరును మార్చుకోం: బెన్ స్టోక్స్
X
యాషెస్ సిరీస్ మూడో మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఒకరోజు మిగిలుండగానే 251 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ ను మట్టికరిపించింది. ఈ క్రమంలో మాట్లాడిని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తమ ఆట గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫలితాలతో సంబంధం లేకుండా తమ ఆట తీరును కొనసాగిస్తామని తెలిపాడు. ‘మా ఆట తీరును మార్చుకోం.. ఇక మీదట కూడా బజ్ బాల్ ఆటనే కొనసాగిస్తామ’ని స్పష్టం చేశాడు.
ఈ సిరీస్ లో ఇంగ్లండ్ బజ్ బాల్ కాన్సెప్ట్ తో బరిలోకి దిగింది. మొదట బజ్ బాల్ వ్యూహం సక్సెస్ అవుతుందని భావించగా.. అది కాస్త బెడిసి కొట్టి మొదటి రెండు మ్యాచుల్లో ఇంగ్లండ్ ఓడిపోయింది. దాంతో మాజీలు ఇంగ్లండ్ వ్యూహంపై విమర్శలు గుప్పించారు. టెస్టుల్లో ఈ విధానం పనిచేయదని, మామూలు ఆట తీరును కొనసాగించాలని సూచించారు. రెండు మ్యాచుల ఓటమి తర్వాత కూడా అదే ఫార్ములాతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. అనూహ్యంగా ఒకరోజు మిగిలుండగానే మ్యాచ్ గెలిచింది. దాంతో మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్.. ‘మేం ఆడే విధానం కరెక్ట్ గానే ఉంది. దాన్ని మార్చేది లేదు. మ్యాచ్ ఏ స్టేజ్ లో ఉన్నా మేం ఇలానే ఆడతామ’ని స్పష్టం చేశాడు.