Home > క్రికెట్ > కౌంట్ డౌన్ స్టార్ట్..ప్రపంచకప్‌ 2023​ టికెట్ ధరలు వచ్చేశాయ్

కౌంట్ డౌన్ స్టార్ట్..ప్రపంచకప్‌ 2023​ టికెట్ ధరలు వచ్చేశాయ్

కౌంట్ డౌన్ స్టార్ట్..ప్రపంచకప్‌ 2023​ టికెట్ ధరలు వచ్చేశాయ్
X

భారత్ వేదికగా జరుగనున్న ప్రపంచకప్ 2023కి కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది. ఈ మెగా ఈవెంట్‎కు సంబంధించిన షెడ్యూల్‎ను కూడా ఐసీసీ తాజాగా ఖరారు చేసింది. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారతదేశంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు వరల్డ్ కప్ టార్గెట్‎గా వ్యూహాలు రచిస్తున్నారు. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ తొలి పోరుతో మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక అక్టోర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక అక్టోబర్ 15న క్రికెట్‌ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల పోరు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ కప్ మ్యాచ్‌ల టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తెలిపింది.





ఈ భారీ ఈవెంట్‎కు కోల్‎కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈడెన్ గార్డెన్స్‎లో 5 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు రెండో సెమీఫైనల్‌ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే అన్ని ప్రపంచ కప్ మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుండి రూ. 3000 వరకు ఉన్నాయి.





బంగ్లాదేశ్ - నెదర్లాండ్స్‌‎కు మధ్య జరిగే మ్యాచ్‎కు సంబంధించి టిక్కెట్ ధరలు చూసుకుంటే. అప్పర్ టైర్స్‎కు రూ.650 టికెట్ ధర ఉండగా, D,H బ్లాక్‌లకు రూ.1000, B, C, K, L బ్లాక్‌లకు రూ.1500 ధర ప్రకటించారు. ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్‎కు మధ్య జరిగే మ్యాచ్‎కు అప్పర్ టైర్స్‎కు రూ.800 టికెట్ ధర ఉండగా,

D,H బ్లాక్‌లకు రూ.1200, C, K బ్లాక్‌లకు రూ.2000, B, L బ్లాక్‌లకు రూ.2200 టికెట్ ధర ఉంది.

బంగ్లాదేశ్ -పాకిస్థాన్‎కు మధ్య జరిగే మ్యాచ్‎కు అప్పర్ టైర్స్‎కు రూ.800 టికెట్ ధర పలుకుతోంది. D,H బ్లాక్‌లకు రూ.1200, C, K బ్లాక్‌లకు రూ.2000, B L బ్లాక్‌లకు రూ.2200 ధరలు ఉన్నాయి. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ ధరలు చూసుకుంటే అప్పర్ టైర్స్ రూ. 900, D,H బ్లాక్‌లకు రూ.1500

C, K బ్లాక్‌లకు రూ.2500 , B, L బ్లాక్‌లు రూ.3000 ధరలు పలుకుతున్నాయి. ఇక సెమీ-ఫైనల్ మ్యాచ్‌ టిక్కెట్ ధరలు చూసుకుంటే అప్పర్ టైర్స్ రూ. 900, D,H, బ్లాక్‌లు రూ.1500.C,K బ్లాక్‌లు రూ.2500, B L బ్లాక్‌లు రూ.3000 వరకు ఉంది.







Updated : 11 July 2023 12:24 PM IST
Tags:    
Next Story
Share it
Top