Home > క్రికెట్ > భారత అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే-ఆర్.అశ్విన్

భారత అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే-ఆర్.అశ్విన్

భారత అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే-ఆర్.అశ్విన్
X

ఈసారి వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతోంది. లాస్ట్ టైమ్ భారత్ లో జరిగినప్పుడు కప్ మనవాళ్ళకే వచ్చింది. అది జరిగి పదేళ్ళు అవుతోంది. ఇప్పుడు మళ్ళీ మన దేశంలోనే టోర్నీ జరుగుతుండడంతో...ఈసారి కప్ మనకే రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో భారత్ ఆటగాళ్ళ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. పదేళ్ళ నిరీక్షణకు తెరదించిన ఛాంఫియన్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు క్రికెటర్ అశ్విన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాడు.





వరల్డ్ కప్ గెలవాలని అందరికీ ఉంటుంది. దానికి ఎంతో సంయమనం ఉండాలి. మేమందరం దాని కోసమే కృషి చేస్తున్నాం. కానీ అభిమానులను నేను కోరుకునేది ఒక్కటే....సానుకూల దృక్పథంతో టీమ్ ఇండియాకు మద్దతుగా నిలవాలని అని అంటున్నాడు భారత్ సీనియర్ స్పిన్నర్ ఆర్.అశ్విన్. గెలిచి వస్తే అందరికీ ఆనందమే. కానీ రాకపోయినా మద్దతుగా నిలుద్దాం. టీమ్ ఇండియాకు మన మద్దతు ఎప్పుడూ తెలియజేస్తూనే ఉందాం అంటున్నాడు.

ప్రపంచకప్ గెలవడం అంత ఈజీ కాదు. అందరూ కలిసికట్టుగా ఆడితేనే అది జరుగుతుంది. ఒకవేళ ఓడిపోయినా అక్కడితో ఆగిపోము, ముందుకు సాగిపోవాలి. అంతేకానీ జట్టులో అతడిని తీసుకుని ఉంటే గెలిచేవాళ్ళం అనే మాటలు మంచివి కావు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇలా చేస్తే బావుంటుంది, అలా ఆడి ఉంటే బావుండేది అనే కామెంట్ల వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆడుతున్నప్పుడు ఇవేమీ గుర్తకు రావు. కాబట్టి మన భారత్ కప్ గెలవాలని మాత్రమే కోరుకుందాం. భారత జట్టు స్ట్రాంగ్ గా ఉంది. మన్ ట్రాక్ రికార్డ్ కూడా బావుంది. కాబట్టి అంతా మంచే జరగాలని కోరుకుందాం అంటున్నాడు ఆర్ అశ్విన్.


Updated : 3 Aug 2023 12:42 PM IST
Tags:    
Next Story
Share it
Top