బ్రియాన్ లారాపై వేటు, సన్ రైజర్స్‌కు కొత్త కోచ్
X
గత మూడేళ్లుగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేదు.కోట్లు ఖర్చు చేసి ప్లేయర్స్ ను కొనుగోలు చేసినా ఫలితం శూన్యం. గత సీజన్ లో కూడా పట్టికలో దిగువ స్థానంలో నిలిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 14 మ్యాచ్‌లలో నాలుగింట మాత్రమే గెలిచి అభిమానులను నిరాశ పర్చింది. దీంతో వచ్చే ఐపీఎల్ -2024 ఐపీఎల్ కోసం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఊహించిన విధంగానే హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేసి.. అతడి స్థానంలో కొత్త కోచ్‌ను నియమించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆరు సీజన్లలో సన్‌రైజర్స్‌కు ఐదుగురు హెడ్ కోచ్‌లు మారారు.
లారా కంటే ముందు టామ్ మూడీ (2019), ట్రెవర్ బెయిలీస్ (2020, 2021), టామ్ మూడీ (2022) సన్‌రైజర్స్ కోచ్‌లుగా వ్యవహరించారు.ఇప్పడు వెటోరీ వచ్చాడు. వెటోరీ హయాంలో సన్ రైజర్స్ రాత మారుతుందో లేదో చూడాలి. 2016 తర్వాత సన్ రైజర్స్ ట్రోపీ గెలవలేదు.
డానియల్ వెటోరికి ఐపీఎల్ లో సుదీర్ఘ అనుభవం ఉంది. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్ జర్నీ ప్రారంభించిన వెటోరీ.. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. ఆ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2013 వరకు ఆ ఫ్రాంచైజీ తరఫునే ఆడాడు. అనంతరం 2014 నుండి 2018 వరకు బెంగళూరుకు కోచ్‌గా వెటోరీ సేవలందించాడు. వెటోరీ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే 2016లో బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ చేరి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది.