Home > క్రికెట్ > డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన !

డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన !

డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన !
X

WTC ఫైనల్ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ సంచలన ప్రకటన చేశాడు. త్వరలోనే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ వైదొలగుతున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే పాకిస్థాన్‌తో టెస్ట్ తనకు చివరిదని వార్నర్ ప్రకటించాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి విండీస్ సిరీస్‌కు ముందు వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్‌తో జరిగే హోమ్ సిరీస్‌తో తన టెస్ట్ కెరీర్‌ను ముగించవచ్చని వార్నర్ వెల్లడించాడు.

అదే విధంగా ఆస్ట్రేలియా జెర్సీలో 2024 T20 ప్రపంచ కప్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తా అన్నాడు. 36 ఏళ్ల వార్నర్ ప్రస్తుతం జూన్ 7న ఓవల్‌లో భారత్‌తో జరగనున్న WTC ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. అనంతరం ఇంగ్లాతో జరిగే యాషెస్ సిరీస్‌లో పాల్గొంటాడు.

డేవిడ్ వార్నర్ 2011లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ ఆరంగ్రేటం చేశాడు. మొత్తం 103 టెస్టులు ఆడాడు. 25 సెంచరీలు, 34 అర్థసెంచరీల సాయంతో వార్నర్ 8, 159 పరుగులు సాధించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వార్నర్‌ది ఏడవ స్థానం. గత కొంత కాలంలో గతంతో బాల్ టాంపరింగ్ కారణంగా ఎదుర్కొన్న కెప్టెన్సీ నిషేధంపై పోరాడుతున్నాడు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.

Updated : 3 Jun 2023 5:56 PM IST
Tags:    
Next Story
Share it
Top