Home > క్రికెట్ > ధోనీ ఫ్యాన్సా మజాకా.. బర్త్డే సందర్భంగా భారీ కటౌట్లు.. ఎక్కడంటే..

ధోనీ ఫ్యాన్సా మజాకా.. బర్త్డే సందర్భంగా భారీ కటౌట్లు.. ఎక్కడంటే..

ధోనీ ఫ్యాన్సా మజాకా.. బర్త్డే సందర్భంగా భారీ కటౌట్లు.. ఎక్కడంటే..
X

టీమిండియా మాజీ కెప్టెట్ మహేంద్ర సింగ్ ధోనీ ఏ చిన్న విషయాన్నైనా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. అలాంటిది ఇవాళ (జులై 7) తలా బర్త్ డే. మరి, రేంజ్ పెంచాలి కదా. అందరూ అనుకున్నట్లే ధోనీ 44వ పుట్టిన రోజును ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కొందరు కేక్ కట్ చేసి, బైక్ ర్యాలీలు తీస్తే.. మరి కొందరు భారీ కటౌట్స్ పెట్టి పేదలకు, అనాథలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు.





హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ధోనీ బర్త్ డే సందర్భంగా 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేస్తే.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా అంబారుపేటలో ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దీనికి రూ. 40వేల నుంచి రూ. 50వేల వరకు ఖర్చు పెట్టినట్లు సదరు అభిమానులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ధోనీ బర్త్ డే సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.




















Updated : 7 July 2023 9:08 AM IST
Tags:    
Next Story
Share it
Top