వరల్డ్‌కప్ ఆడిన క్రికెటర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడండి..
X
క్రీడాకారులు, నటులు, రాజకీయల నాయకుల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఫామ్, ఫేమ్ ఉన్నప్పుడు రాజా భోగాలు అనుభవిస్తారు. అవి ఒక్కసారి పోతే జీవితం తలక్రిందులు అయిపోవడం ఖాయం. ఇందుకు ఎందరో జీవితాలు ఉదాహరణగా మనకు కనిపిస్తాయి. తాజాగా మరో క్రికెటర్ జీవితం అదే కోవలోకి వస్తోంది. దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతడు ప్రస్తుతం సాధారణ జీవితం అనుభవిస్తున్నాడు. తన కుటుంబం కోసం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలంక క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించిన ఆటగాడు సూరజ్ రాందీవ్. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్ 2009లో శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియాతో భారత్‌లో జరిగిన వన్డేతో సూరజ్ అరంగేట్రం చేశాడు. తర్వాత టెస్టులు, టీ20 ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రెండు సంవత్సరాలు పాటు రాణించిన సూరజ్ రాందీవ్ 2011 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు.ఫైనల్ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగాడు. . మొత్తం అతడు శ్రీలంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. అంతేకాకుండా ధోని కెప్టెన్సీ సీఎస్కే తరఫున 8 ఐపీఎల్ మ్యాచ్ ల్లో కూడా ప్రాతినిథ్యం వహించాడు.
అంతటి టాలెంట్ ఉన్న సూరజ్ రాందీవ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 2016లో చివరి అంతర్జాతీయ(వన్డే) మ్యాచ్ ఆడిన సూరజ్ రాందీవ్.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికి ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. అక్కడ మెల్‌బోర్న్‌లోని లోకల్ క్లబ్ ఆటగాడిగా కొనసాగాడు. అనంతరం ఓ బస్సు డ్రైవర్ ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సూరజ్ రాందీవ్ పనిచేస్తున్న కంపెనీలో మరో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్స్‌కూడా డ్రైవర్లగా పనిచేయడం గమనార్హం. లంక మాజీ ఆటగాడు చింతక జయసింఘే, జింబాబ్వే క్రికెటర్ వాడింగ్టన్ మ్వేంగా కూడా ఇక్కడే డ్రైవర్ వృత్తిలో ఉన్నారు.