అదృష్టం వల్లే భారత్ వరల్డ్కప్ గెలిచింది.. అంతేకానీ..
X
ఏలాంటి అంచనాలు లేకుండా 1983 వరల్డ్ కప్ భరిలోకి దిగిన టీమిండియా.. కపిల్ దేవ్ సారథ్యంలో కప్పు ఎగరేసుకుపోయింది. అప్పటి వరకు టీమిండియాను చులకనగా చూసినవాళ్ల నోళ్లు మూయిస్తూ.. చరిత్ర సృష్టించింది. దాంతో ప్రపంచ క్రికెట్ లో భారత్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయితే, అప్పటి జ్ఞాపకాల గురించి మాట్లాడిన అప్పటి వెస్టిండీస్ పేస్ దిగ్గజం ఆండీ రాబర్డ్స్.. భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘1983 ప్రపంచ కప్ లో టీమిండియా ఆటగాళ్లలో ఏ ఒక్కరి ప్రదర్శన నన్ను ఆకట్టుకోలేకపోయింది. అదృష్టం వల్లే భారత్ 1983 వరల్డ్ కప్ గెలిచింది. ఆ టోర్నీలో భారత్ నుంచి ఒక్క స్టార్ బ్యాటర్ లేదు. కనీసం నాలుగు వికెట్లు తీసిన బౌలర్ కూడా లేడు. ఆ వరల్డ్ కప్ లో మేం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నం అన్ని మ్యాచుల్లో గెలిచాం. ఫేలవ ప్రదర్శన వల్ల భారత్ తో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. వివ్ రిచర్డ్స్ ఔటయ్యాక మేం పుంజుకోలేకపోయాం అంతే. 183 పరుగులకే ఆలౌట్ అవడం భారత్ కలిసి వచ్చింది. కానీ, ఆ తర్వాత భారత్ తో జరిగిన సిరీస్ ను 6-0తో క్లీన్ స్వీప్ చేశామ’ని రాబర్డ్స్ చెప్పుకొచ్చాడు.