Home > క్రికెట్ > KKR ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్

KKR ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్

KKR ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్
X

ఇండియాలో క్రికెట్కు క్రేజ్ ఎక్కువ. ఇక ఐపీఎల్ సీజన్ మొదలైందంటే.. దేశంలో ఓ పండగ వాతావరణం ఉంటుంది. టోర్నీ మొదలైనప్పటినుంచి ఫైనల్ అయిపోయే వరకు.. ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ ఫీవర్తో ఊగిపోతారు. సాయంత్రం అయిందంటే చాలు.. ప్రతీ ఇంటా ఐపీఎల్ సౌండ్ మోగిపోతుంది. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ మెగా లీగ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేనేజ్మెంట్లు టీమ్ కాంబినేషన్, గేమ్ ప్లానింగ్​ మీద ఫోకస్ పెట్టాయి. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే మెగా లీగ్ ముందు.. KKR ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ పడింది.

గత సీజన్లో లక్నోకు మెంటార్గా ఉన్న గంభీర్.. ఇప్పుడు కోల్కతాకు మారాడు. క్రికెట్కు పూర్తి స్థాయి సేవలందించేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్.. అప్కమింగ్ టోర్నీ గురించి మాట్లాడాడు. అదే టైంలో KKR ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం గంభీర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రొఫెషన్పై ఎంతో క్లారిటీ ఉండే గంభీర్.. ప్లేయర్లకు అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ తారలు, పార్టీలు కాదని.. పూర్తి కమిట్మెంట్తో ఆడాలని సూచించాడు.

‘‘ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత కఠినమైన లీగ్. అంతర్జాతీయ క్రికెట్కు సమానంగా ఉంటుంది. సక్సెస్ ఫుల్ ప్లేయర్గా ఎదగాలన్నా.. విజయవంతమైన టీంగా మారాలన్నా డిసిప్లేన్తో ఉండాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి పట్ల నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది’’అని ప్లేయర్స్కు గంభీర్ సూచించాడు. గతంలో KKRకు కెప్టెన్గా ఉన్న గంభీర్.. రెండు IPL టైటిల్స్ను అందించాడు. గత సీజన్స్లో లక్నోకు మెంటార్గా ఉన్న ఆయన.. రెండుసార్లు KKRను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడు మరోసారి తన పాత జట్టులో చేరాడు. అయితే గత కొన్ని సీజన్స్ నుంచి ప్లేఆఫ్స్కు చేరలేకపోతున్న KKRకు.. గంభీర్ పూర్వవైభవం అందిస్తాడో లేదో చూడాలి.

Updated : 6 March 2024 2:20 PM GMT
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top