ఆ బౌలర్ అంటే నాకు భయం : వీరేంద్ర సెహ్వాగ్
X
బౌలర్లను వీర బాదుడు బాదే బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్. క్రీజ్‌లోకి అడుగుపెట్టగానే బౌలర్లను దంచికొట్టడమే ఈ భారత్ మాజీ ఓపెనర్ లక్ష్యం. ఫార్మెట్ తో సంబంధం లేదు, బౌలర్ అంటే అసలు లెక్కే లేదు. అక్తర్, బ్రెట్ లీ లాంటి అరవీర భయంకర బౌలర్స్ విసిరిన బంతులను అవలీలగా బౌండరీకి తరలించేవాడు. ప్రతి బౌలర్ చీల్చి చెండాడి భారత్ సాధించిన ఎన్నో విజయాల్లో భాగమయ్యాడు. అట్లాంటి వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓ బౌలర్ అంటే మాత్రం పిచ్చి భయం. అతడు బంతికి బౌలింగ్ వస్తే వణికిపోయాడు. అతడు ఎవరో కాదు టెస్ట్ శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా చెప్పాడు. మురళీధరన్ అంటే తనకు భయమని..పరుగులు తీసేందుకు ఇబ్బంది పడే వాడినని వెల్లడించాడు.
బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ " నాకు ముత్తయ్య మురళీధరన్ అంటే భయం. అతడు విసిరిన దూస్రాలు ఇబ్బంది పెట్టేవి. అతని బౌలింగ్ లో ఎలా పరుగులు చేయాలో నాకు అర్థం అయ్యేది కాదు. మురళీధరన్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడేవాడిని. షేన్ వార్న్, షోయబ్ అక్తర్,అక్తర్, బ్రెట్ లీ, గ్లెన్ మెక్గ్రాత్లకు ఎప్పుడూ భయపడలేదు. వాళ్ల బౌలింగ్‌కు వస్తే ఔట్ అవుతా అనే భయం ఉండేదు కాదు కానీ..హెల్మెట్ లేదా శరీరానికి గాయాలవుతాయన్న జంకుతో ఉండేవాడిని. కానీ నేను భయపడింది ఒక్క మురలీధరన్ కు మాత్రమే." అని సెహ్వాగ్ తెలిపాడు.
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. రెండు ఫార్మాట్లలో శ్రీలంకకు తిరుగులేని విజయాలను అందించాడు. 800 టెస్టు వికెట్లు, 534 వన్డే వికెట్లతో ప్రపంచంలోనే నెం.1 బౌలర్‌గా ఉన్నాడు. ఏ ఇతర బౌలర్ కూడా అతని దరిదాపుల్లో కూడా లేరు. మురలీధరన్ విసిరిన గింగిరాల బంతులు ఎదుర్కోవడం బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారేది.