ముంబై లేకుంటే నేను లేను: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా
X
ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతుంది. టీంలన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. ఈసారి ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్యం అప్పగించిన విషయం తెలిసిందే. ఇక ఆట మొదలుకానున్న తరుణంలో హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ స్పోర్ట్స్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముంబై లేకపోతే తాను లేనని అన్నాడు. 2015 ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టుకు ఆడటంతోనే తన ప్రయాణం మొదలైందని.. నాటి సంఘటనలను పాండ్యా గుర్తుచేసుకున్నాడు.
‘అది 2015. నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం. ఈ ఏడాదే నా ప్రయాణం మొదలైంది. ఎన్నో ఆశలతో ప్రపంచ క్రికెట్ లో అడుగుపెట్టిన ఓ అబ్బాయి కలలు అప్పుడే నెరవేరాయి. ముంబై ఇండియన్స్ లేకపోతే.. నేను క్రికెట్ లో ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. మొత్తం సీజన్ లో ముంబైకి నా వంతు సాకారం అందించా. అదే లీగ్ లో రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నా. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చాడు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.