ఆస్ట్రేలియా, ఇంగ్లండ్కు భారీ జరిమానా
X
యాషెస్ సిరీస్ 2023లో కంగారులు బోణీ కొట్టారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో రెండు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా పాట్ కమ్మిన్స్ (44, 73 బంతుల్లో), ఖవాజాతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి.. జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. సిరీస్ లో తొలి విజయం సాధించిన ఆసీస్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో స్లో ఓవరేట్ మెయింటెన్ చేసినందుకు ఇరు జట్లకు జరిమానా విధించింది. నిర్ణీత టైంలో రెండు ఓవర్లు తక్కువగా వేశారన్న మ్యాచ్ రెఫరీ.. ఇరు జట్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలం అయితే ఓవర్ కు 20శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. లేటుగా వేసిన ప్రతీ ఓవర్ కు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లో ఒక పాయింట్ కోత విధిస్తారు. దాంతో ఇప్పుడు ఇరు జట్లు పాయింట్స్ టేబుల్ లో ఒక్కో పాయింట్ కోల్పోయింది.