Home > క్రికెట్ > Asia cup2023: ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ రికార్డ్!

Asia cup2023: ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ రికార్డ్!

Asia cup2023: ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ రికార్డ్!
X

మెగా టోర్నీలంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసేది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. దయాదులు గ్రౌండ్ లో పారాడుతుంటే.. స్టేడియంలో ఫ్యాన్స్ టెన్షన్ తో ఊగిపోతుంటారు. అయితే, ఆసియాకప్ అయినా, వన్డే, టీ20 వరల్డ్ కప్ అయినా పాకిస్తాన్ పై భారత్ దే పై చేయి అని ఎంతమందికి తెలుసు. అవును.. మెగా టోర్నీల్లో పాక్ పై భారత్ హవా కొనసాగుతోంది. ఆసియా కప్ వన్డే ఫార్మట్ లో ఇప్పటివరకు ఇండియా, పాకిస్తాన్ 13 సార్లు తలపడగా.. అందులో 7 మ్యాచ్ లు భారత్ గెలిస్తే, పాక్ ఐదు సార్లు గెలిచింది. ఇక టీ20 ఫార్మాట్ లో భారత్ 2 గెలిస్తే, పాక్ 1 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలింతం తేలలేదు.





అయితే, చివరిసారిగా ఇరు జట్లు వన్డే ఫార్మట్ లో మూడు మ్యాచ్ లు ఆడగా.. వాటిలో భారత్ గెలిచి విజయ పరంపర కొనసాగిస్తోంది. అయితే, ద్వైపాక్షక సిరీసుల్లో మాత్రం పాక్ దే పై చేయి. ఇరుజట్లు 132 మ్యాచుల్లో తలపడగా.. అందులో భారత్ 55 గెలిస్తే, పాక్ 73 మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం పల్లెకెలె వేదికపై జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ రాణిస్తోంది. రోహిత్ శర్మ (11), కోహ్లీ (4), శ్రేయస్ (14), గిల్ (10) నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అఫ్రిది, రౌఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.




Updated : 2 Sept 2023 5:19 PM IST
Tags:    
Next Story
Share it
Top