Home > క్రికెట్ > చెలరేగి ఆడుతున్న భారత ఆటగాళ్ళు

చెలరేగి ఆడుతున్న భారత ఆటగాళ్ళు

మనకి తిరుగేలేదు...8వికెట్ల దూరంలో విజయం

చెలరేగి ఆడుతున్న భారత ఆటగాళ్ళు
X


వెస్ట్ ఇండియాలో భారత్ కు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్లేయర్లు అందరూ బాగా ఆడుతుండడంతో రెండో టెస్ట్ లో కూడా విజయం దిశగా అడుగులు వేస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగుల ఆధిక్యంతో భ్యాటింగ్ మొదలుపెట్టిన టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ట్రినిడాడ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో కూడా భారత్ తన ప్రతాపం చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో 24 ఓవర్లు మాత్రమే ఆడిన ఇండియా 181 పరుగులు చేసింది. అంతకు ముందు 183 పరుగులు ఆధిక్యలో ఉంది. దాంతో వెస్ట్ ఇండీస్ గెలవాలంటే 365 పరుగులు చేయాల్సి ఉంది. భారీ ఆధిక్యం సాధించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్‌లు రోహిత్‌ శర్మ 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57పరుగులు, యశస్వి జైస్వాల్‌ 4 ఫోర్లు, 1 సిక్స్‌ లతో 38 పరుగులు చేసి దూకుడుగా ఆడారు. రోహిత్‌, జైస్వాల్‌ వెంటవెంటనే ఔట్ అయినా.. ఇషాన్‌ కిషన్‌ టీ20 తరహాలో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్ 29 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఇషాన్‌ అర్ధ సెంచరీ చేయగానే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 438 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట వర్షం వల్ల కాసేపు ఆగిపోయింది.

భారత్ బౌలర్ అశ్విన్ తన బౌలింగ్ తో చెలరేగిపోతున్నాడు. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (24), జర్మన్ బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు. చివరి రోజు విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు అవసరం కాగా.. టీమిండియాకు 8 వికెట్స్ కావాలి. 18వ ఓవర్లో బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసిన ఆర్ అశ్విన్ టీమిండియాకు ఆరంభం ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కిర్క్‌ మెకంజీ (0)ని ఔట్‌ చేసాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లో హైదరాబాద్ బౌలర్ సిరాజ్ 60 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకుని చెలరేగాడు. చివరి నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ భరతం పట్టాడు. ఆరంభంలోనే ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అథనేజ్‌(37) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే సీనియర్ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ (15)ను సిరాజ్‌ ఔట్ చేశాడు. ఆపై అల్జారీ జోసెఫ్‌ (4), కీమర్‌ రోచ్‌ (4), షానోన్ గాబ్రియెల్‌ (0)లను ఔట్ చేయడంతో...విండీస్ తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది.


Updated : 24 July 2023 9:27 AM IST
Tags:    
Next Story
Share it
Top