Home > క్రికెట్ > IND vs IRE: భారత్‌ ఘన విజయం..సిరీస్‌ మనదే

IND vs IRE: భారత్‌ ఘన విజయం..సిరీస్‌ మనదే

IND vs IRE: భారత్‌ ఘన విజయం..సిరీస్‌ మనదే
X

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో భారత క్రికెట్ జట్టు ఆదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన జస్‌ప్రీత్ బుమ్రా సేన.. నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్​ను 152 పరుగులకే మూసేసింది. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్​ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించించిన తొలి మ్యాచులో డక్‌వర్త్‌ లూయిస్ ప్రకారం 2 పరుగులతో విజయం సాధించింది భారత్. కానీ రెండో టీ20లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లోనూ తిలక్ వర్మ నిరాశపరిచాడు. తిలక్ వర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సంజూ శాంసన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేసి సంజూ ఔట్ కాగా, రుతురాజ్ గైక్వాడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసి 58 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివరి ఓవర్లో రింకూ సింగ్, శివమ్ దూబేలు బాధ్యతగా ఆడుతూ విధ్వంసం సృష్టించారు. రింకు 180 స్ట్రైక్ రేట్‌తో కేవలం 21 బంతుల్లో 38 పరుగులు చేయగా, దూబే 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రింకూ-శివం జోడీ చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు చేయడంతో టీమిండియా 185 పరుగులు చేయగలిగింది.యువ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (58), సంజు శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22*) చెలరేగడం వల్ల టీమ్ఇండియా మంచి స్కోర్ సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో మెకర్థీ రెండు, యంగ్, వైట్, అదేర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 186 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన ఆతిథ్య జట్టును టీమ్ఇండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మూడో ఓవర్లో వరుసగా స్టిర్లింగ్ (0), టక్కర్ (0)ను వెనక్కిపంపాడు ప్రసిద్ధ్. తర్వాత స్కోర్​ బోర్డు పరుగులు పెట్టినా.. ఐర్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతోంది. ప్రత్యర్ధి జట్టులో.. ఓపెనర్ బల్​ బిర్ని (72) ఒక్కడే రాణించాడు. 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. మిగతా వారెవరు రాణించలేదు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్, రవి బిష్ణోయ్, బుమ్రా తలో రెండు, అర్షదీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్​ను 152 పరుగులకే కట్టడి చేసింది బుమ్రా సేన. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్​ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే నెగ్గింది.





Updated : 21 Aug 2023 4:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top