IND vs WI 1st T20: భారత్ vs వెస్టిండీస్.. మరో పోరుకు సిద్ధం
X
కరీబియన్ జట్టు విండీస్ పై టెస్టు సిరీస్, వన్డే సిరీస్ గెలిచి మాంచి ఊపు మీదున్న టీమిండియా ఇప్పుడు టీ20 సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో శుభారంభం చేయాలనే లక్ష్యంతో హార్దిక్ పాండ్యా జట్టు భావిస్తోంది. భారత్, విండీస్‌ల మధ్య మూడో వన్డే ఇక్కడే జరిగింది. బ్యాటింగ్ కు సహకరించే ఈ పిచ్ లో టీమిండియా బోణీ కొట్టాలనుకుంటోంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దూరదర్శన్ స్పోర్ట్స్ (డీడీ స్పోర్ట్స్) ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.(JioCinema యాప్, వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చు)
హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ ద్వారా టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్‌తో కలిసి యశస్వినే ఓపెనింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్ వచ్చే అవకాశం ఉంది. తిలక్ నాలుగో స్థానంలో రావచ్చు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, వైస్‌కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ దిగే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను చూసుకుంటారు. మూడో స్పిన్నర్‌గా చాహల్, రవి బిష్ణోయ్‌ల్లో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. పేసర్ ముకేశ్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
షెడ్యూల్ ఇదే:
ఆగస్టు 3- ఫస్ట్ టీ20 మ్యాచ్ (బ్రియన్ లారా స్టేడియం, ట్రినిడాడ్)
ఆగస్టు 6 – సెకండ్ టీ20 మ్యాచ్ (ప్రావిడెన్స్ స్టేడియం, గయానా)
ఆగస్ట్ 8 – థర్డ్ టీ20ఐ (ప్రావిడెన్స్ స్టేడియం, గయానా)
ఆగస్టు 12 – ఫోర్త్ టీ20ఐ (సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం, ఫ్లోరిడా)
ఆగస్టు 13 – ఫిఫ్త్ టీ20ఐ (సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం, ఫ్లోరిడా)
జట్ల అంచనా:
భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, ఒషానే థామస్.